ఓ జపాను నుండి ఓ పెద్ద మనిషి ఇండియాకు విహార యాత్రకు వచ్చాడు. చివరి రోజు ఒక క్యాబ్‌ను మాట్లాడుకొని విమానాశ్రయానికి బయలుదేరాడు. ప్రయాణంలో ఒక హోండా కారు క్యాబును దాటి దూసుకెల్లింది. వెంటనే జపానువాడు సంతోషంగా తల విండోలోనుంచి బయటకి పెట్టి మరీ చూసి..
హొండా.. మేడ్ ఇన్ జపాన్ వెరీ ఫాస్టు…అన్నాడు గర్వంగా.
కాసేపు తర్వాత ఒక టొయొటా కారు వారి క్యాబ్‌ను దాటి దూసుకెల్లింది.. మల్లీ మన జపాను హీరో.. విండోలోనుండి తల బయట పెట్టి..
టొయోటా.. మేడ్ ఇన్ జపాన్… వెరీ ఫాస్టు అన్నాడు గర్వంగా.
కాసేపు తర్వాత ఒక మిత్సుబిషి కారు వారి క్యాబ్‌ను దాటి దూసుకెల్లింది.. మల్లీ మనవాడు తల బయట పెట్టి..
మిత్సుబిషి..మేడ్ ఇన్ జపాన్..వెరీ ఫాస్టు అన్నాదు ఇంకా గర్వంగా.
మన క్యాబు డ్రైవరుకు బాగా కోపం వచ్చింది. కానీ అప్పటికి ఏమీ అనకుండా ఉరకున్నాడు. ఇలా చాలా కార్లు వారి క్యాబు దాటుకుంటు వెల్లాయి. చివరగా విమానాశ్రయం వచ్చింది. ఎంతైందని అడిగాడు జపాను హీరో..
800 అయ్యిందని కూల్‌గా చెప్పాడు క్యాబు డ్రైవరు..
800..అబ్బో చాలా ఎక్కువ అయ్యింది అన్నాడు జపానువాడు ఆశ్చర్యంగా.. వెంటనే మన క్యాబు ద్రైవరు.. క్యాబు మీటర్ ను తట్టి చూపిస్తూ..
మీటెర్.. మేడ్ ఇన్ ఇండియా వెరీ వెరీ వెరీ ఫాస్టు.. డబ్బులు తియ్ అన్నాడు గట్టిగా..
0 comments:
Post a Comment