Tuesday, September 29, 2009

చిన్న చిన్న జోక్స్ - (ఆ)

Joke

"ఏంటి అంత కోపంగా ఉన్నావ్..?" సరోజను అదిగింది సుజాత

"ఇవాళ ముచ్చటపడి ఆర్టీసీ బస్టాండులో వెయింగ్ మెషిన్ ఎక్కి రూపాయి నాణెం వేస్తే.. "ఒకేసారి ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చిందే..!!" కోపంగా చెప్పింది సరోజ.
_______________________________

Comedy

"మా ఆయనకి భయపడి కాస్త పెద్దవయస్సున్న దానిని పన్లోకి పెట్టుకోవడం తప్పైపోయింది..!" చెప్పింది సురేఖ

"ఏమైందేమిటి..?" అడిగింది సుజాత

"అదెందుకు అడుగుతావులే..! ఆ ఆడది మామగారిని దాని కొంగున ముడేసుకుంది..!" అసలు విషయం చెప్పింది సురేఖ.
_______________________________

Joke

"ఈ మధ్య ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుందిరా?" అన్నాడు సూరిగాడు

"ఎందుకురా అంత భయం?" అడిగాడు రామారావు

"నా భార్య ఎందుకు లేటని క్లాస్ పీకుతుందిరా..!" అసలు విషయం చెప్పాడు సూరిగాడు

"ఎంత పిరికివాడివిరా..! ధైర్యంగా రెండు పెగ్గులేసుకుని ఇంటికి వెళ్లు అంతా సరిపోతుంది..!" సలహా ఇచ్చాడు రామారావు

"అయ్యబాబోయ్ ఏం సలహా ఇచ్చావ్‌రా? తప్పతాగితే నా కళ్లకి ఒకేసారి ఇద్దరు భార్యలు కనిపిస్తారు రా..!" వాపోయాడు సూరిగాడు.
_______________________________

Comedy
"మతిమరుపు సుబ్బయ్య చెప్పుల షాపుకు వెళ్లి స్లిప్పర్స్ కావాలన్నాడు.

సేల్స్ మాన్ షాపులోని అన్ని రకాల స్లిప్పర్స్ చూపించినా సుబ్బయ్యకు పాదాలకు సరిపోలేదు.

వెతికి వెతికి చివరికి సుబ్బయ్య పాదాలకు ఓ జత సరిపోయింది.

వెంటనే సేల్స్‌మ్యాన్‌తో సుబ్బయ్య ఇలా అన్నాడు."

"ఈ చెప్పులు నా పాదాలకు సరిపోయాయి ప్యాక్ చేయండి..!"

"(సేల్స్‌మాన్ సుబ్బయ్యని ఎగాదిగా చూసి..) అవి మీరేసుకొచ్చినవే..!" అని చిరాగ్గా చెప్పాడు.
_______________________________

Joke

"చేతికి వాచ్ పెట్టుకోవు కదా. పీరియడ్ అయిపోయిందని ఎలా తెలుస్తుందిరా?" అడిగాడు రవి

"చాలా ఈజీరా మన క్లాస్‌మేట్స్ అందరూ లెక్చరర్ పాఠం వినకుండా వాచీలను చూస్తున్నారంటే క్లాస్ అయిపోయిందని అర్థం చేసుకోవాల్సిందే..!" అసలు విషయం చెప్పాడు సుందర్.
_______________________________

Joke

సుమంత్ : "సార్ ఓ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే తంటాల్లో పడతాడంటారా?"

సుబ్బులు : "అయ్యో దానికి ఇద్దరెందుకు..బాబూ.. ఒకరే చాలు...!"
_______________________________

Comedy
ఓ హోటల్‌కు భోజనం తినడానికని వెళ్లాడు రాజా. అక్కడ సర్వర్ ఇచ్చిన భోజనాన్ని చూసి ఇలా అన్నాడు.

రాజా : ఈ భోజనాన్ని గాడిదలు కూడా తినవు.

సర్వర్ : అయితే ఉండండి. గాడిదలు తినే భోజనం తెస్తాను.
_______________________________

Joke
"యజమాని సేవకుడు అనే తారతమ్యం లేకుండా ఉండాలంటారు. దాన్ని నేను ఆచరణలో పెట్టాను తెలుసా?" అన్నాడు వినోద్

"ఎలా..? అడిగాడు సురేష్

"మా ఆవిడ ఊరెళితే ఆ స్థానాన్ని మా పనిమనిషికి ఇచ్చాను..!" అసలు విషయం చెప్పాడు వినోద్.
_______________________________

Comedy
"ఈ బస్సు డ్రైవర్‌కు అస్సలు జాలి అనేది లేదే..!" కోపంగా అంది రోజా

"నీకెలా తెలుసే..?" అడిగింది సుమతి

"బస్సు కండక్టర్ చూడు ప్రయాణికులను చూడగానే లేచి నిలబడి మరీ సీటు ఇస్తాడు. ఈ డ్రైవర్ మాత్రం అలాగే కూర్చుని ఉంటాడే..!"
_______________________________

Joke
"నా భార్యకు వాషింగ్‌మెషన్‌ కావాలని గొడవ చేస్తోందిరా.." బాధగా చెప్పాడు ప్రేమ్

"ఎంతైనా అదృష్టవంతుడివిరా... నా భార్యకు నేనే వాషింగ్‌మెషన్‌‌ని...!" అంతే బాధగా బదులిచ్చాడు సుధీర్.

_______________________________

Joke
"నీ ఆఖరి కోర్కె ఏమిటో అడగవయ్యా?" ఉరిశిక్ష పడిన సోమును అడిగాడు జడ్జి

"మా ఆవిడను పిలిపించండి.. కసితీరా తిట్టాలని ఉంది...!" చెప్పాడు సోము.

లారీ డ్రైవర్
మంగళగిరి హైవే ప్రక్కన డాబా లో నులక మంచం మీద కూర్చొని పుల్కాలు తింటూ ఇద్దరు
లారీ డ్రైవర్లు మాట్లాడుకుంటున్నారు ,

"ఒరేయ్ రాజు , మొన్న నేను హైదరాబాదు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా "
మొదలు పెట్టాడు గిరి .

" ఏం జరిగిందేటి "

" నేను వేగంగా కోఠీ లో వన్ వే లో వెడుతున్నా ,ట్రాఫిక్ పోలీసోడు కనీసం ఆపలేదురా "

"నువ్వు అదృష్టవంతుడివి .నా దగ్గర ఆడు సరైన దారి లో వెళ్ళినా,ఎన్ని సార్లు , ఎంత గుంజాడో
లెక్కే లేదు "

"అదృష్టం లేదు , ఏం లేదు , అప్పుడు నేను పరిగెత్తుకొని వన్ వే లో వెళుతున్నా , అంతే "
_________________

ఏకాంతమేనా?

“నా భార్య చనిపోయిన తర్వాత నాకు మిగిలింది ఏ కాంతమే”

“ఆయ్యో పాపం, ఒక్కడివీ ఎలా ఉంటున్నవురా?”

“ఓక్కణ్ణే ఉంటున్నానని ఎవరన్నారు? ఏ. కాంతం అని మనం కాలేజీ లో చదివేప్పుడు వెంట పడే వాళ్ళం గుర్తుందా… ఆమెతో కలసి ఉంటున్నా”

లేచిపోదామా?

“రాణీ, ఇక లాభం లేదు. ఈ రోజు రాత్రి సరిగ్గా రెండు గంటలకు మనం ఈ ఊరు విడిచి పారిపోవాలి.” అడిగాడు ఆ కాబోయే అభాగ్యుడు.

“సరే రాజు! అలాగే చేద్దాం”

“ఖచ్చితంగా ఆ టైముకు రడీ గా ఉండు. నేను రాగానే పారిపోదాం…”

“నువ్వేమీ బెంగ పెట్టుకోకు రాజు, మా నాన్న నిన్ననే నా లగేజీ పాక్ చేసి పెట్టాడు. ”

గుత్తొంకాయ విలువ

కొత్తగా కాపురం పెట్టిన గోపాలం భార్యతో అన్నాడు. “నువ్వు మీ అమ్మ ద్వారా తెలుసుకొని చేసిన గుత్తొంకాయ కూర విలువ 435 రూపాయలు”

“ఆంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు”?

“ఇదిగో STD బిల్లు”

దొంగా, దొంగా

మన పెళ్ళి రోజుకు టివి కావాలని అడిగావు కదా! పక్క షాపులో దొంగిలించి తెచ్చాను తీసుకో” అన్నాడు దొంగ.

“ఏడ్చినట్టే ఉంది, ఆ షాపులో టివి కొంటే ప్యాన్ ఉచితం అని రాశారు కదా! మరి ప్యాను వదిలేసి వచ్చరేం? ..” అన్నది దొంగది.

కోరికలు

“నేను కూడా మా నాన్న లాగే డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను” అంది బుడిగి.

“అదేంటి, మీ నాన్న ఏదో ఆఫీసులో క్లర్కు అని గుర్తు….”

“నేను చెప్పేదీ అదే, .. మా నాన్న కూడా అలాగే కోరుకున్నారు”



0 comments:

Post a Comment

Welcome to my website

welcome to nanigadu.com

సైట్ అప్ లోడ్ చేయబడుతుంది మరి కొద్ది రోజుల్లో మీకీ సౌకర్యం లబిస్తుంది ఇట్లు:nanigadu.com by:ch.ramakrishnamraju@gmail.com

chat & give coments

online now (world)

score

menu bar

telugu blogs

nanigadu.com

Followers

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More